వచ్చే ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు

దేశంలో క్రీడా అభిమానులు క్రికెటర్లను ఎంతగా ఆరాధిస్తారో తెలిసిందే. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లకు బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ ఉంటారు. వీళ్లకు ఉండే క్రేజ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికే క్రికెట్ లో ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసిన ఎం ఎస్ ధోని బయోపిక్ వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎం ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ పేరుతో విడుదల అయిన ఈ సినిమా దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా 2016 సెప్టెంబర్ 30 న విడుదల అయింది. ఇప్పుడు దాదా గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే సౌరవ్ గంగూలీ బయో పిక్ రానుంది. ఈ సినిమా కు సంబదించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది.



