Telugu Gateway
Cinema

డాకుమహారాజ్ రికార్డు కలెక్షన్స్ 156 కోట్లు

డాకుమహారాజ్ రికార్డు కలెక్షన్స్ 156 కోట్లు
X

నందమూరి బాలకృష్ణ కు కలిసివచ్చిన సీజన్ సంక్రాంతి. ఈ పండగకు వచ్చిన అన్ని బాలకృష్ణ సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు డాకుమహారాజ్ అయితే ఏకంగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 156 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా ఇది నిలిచింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

డాకుమహారాజ్ లో బాలకృష్ణ కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ సినిమాను ఎలివేట్ చేయటంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాత్ర ఎంతో కీలకం అయిన విషయం తెల్సిందే. ఆయన అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను ఈ రేంజ్ కు తీసుకెళ్లింది అని చెప్పాలి. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా వీరసింహ రెడ్డి ఉంటే...ఈ రికార్డు ను ఇప్పుడు డాకు మహారాజ్ బ్రేక్ చేసింది. వీరసింహ రెడ్డి గ్రాస్ వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా 133 కోట్ల రూపాయలు అయితే..డాకు మహారాజ్ 156 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.

Next Story
Share it