ఎన్టీఆర్..రామ్ చరణ్ లకు హెల్మెట్ పెట్టారు
BY Admin29 Jun 2021 11:01 AM GMT
X
Admin29 Jun 2021 11:01 AM GMT
ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మంగళవారం నాడు కీలక అప్ డేట్ ఇచ్చింది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిపింది. అదే సమయంలో ఓ లుక్ ను కూడా విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్ బైక్ డ్రైవ్ చేస్తుండగా..రామ్ చరణ్ వెనక కూర్చుని ఉన్నారు. భారీ అంచనాలతో కూడిన ఈ సినిమా అప్ డేట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అది కాస్తా సైబర్ బాద్ ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. వెంటనే వాళ్ళు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు హెల్మెట్ లు పెట్టి ఫోటో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది..హెల్మెట్ పెట్టుకోండి..సురక్షితంగా ఉండండి అంటూ కామెంట్ జోడించారు. అదే సమయంలో ఈ ఫోటోను హీరోలతోపాటు దర్శకుడు రాజమౌళి, డీవీవీ మూవీస్ కు కూడా ట్యాగ్ చేశారు.
Next Story