Telugu Gateway
Cinema

నెట్ ఫిక్స్ లో నాని మూవీ

నెట్ ఫిక్స్ లో నాని మూవీ
X

టాలీవుడ్ లో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న సినిమా ల్లో కోర్టు మూవీ ఒకటి. హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరూ ఊహించని విజయాన్ని దక్కించుకుంది. అయితే నిర్మాత నాని మాత్రం పూర్తిగా కథనే నమ్మే ఎంతో ధీమాతో ఈ సినిమా చేశారు అనే విషయం ఫలితం చుసిన తర్వాత అర్ధం అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 57 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 11 నుంచి ఇది ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. థియేటర్ లో ఈ సినిమా చూడని వాళ్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా సమ్మర్ హాలిడే లో ఓటిటి లోకి అందుబాటులోకి వస్తే ఇక్కడ కూడా ఈ సినిమా రికార్డు లు బద్దలు చేసే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. కోర్టు మూవీ లో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు.

Next Story
Share it