Telugu Gateway
Cinema

అమెజాన్ లో స్ట్రీమింగ్

అమెజాన్ లో స్ట్రీమింగ్
X

హీరో సంతోష్ శోభన్ కు చాలా రోజులు తర్వాత ఒక మంచి సినిమా దక్కింది. వాలెంటైన్స్ డే రోజు అయన హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంతోష్ శోభన్ కు జోడిగా మానస వారణాసి నటించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13 .50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దిగటం ఈ మూవీ కి కలిసి వచ్చింది.

అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టిన ఈ సినిమా ఓటిటి లో కూడా మంచి విజయాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అనే ధీమాతో చిత్ర యూనిట్ ఉంది.

Next Story
Share it