Telugu Gateway
Cinema

అంచనాలు పెంచుతున్న అనిల్ రావిపూడి

అంచనాలు పెంచుతున్న అనిల్ రావిపూడి
X

సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి మరో సారి మ్యాజిక్ చేసేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో సూపర్ హిట్ దక్కించుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మంగళవారం నాడు చిరంజీవి, వెంకటేష్ లు కలిసి చేసిన మాస్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాత కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ తమదైన స్టైల్స్ తో ఆకట్టుకున్నారు.

జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ లో చిరంజీవి తో పాటు వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకటేష్ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్‌లో వెంకీ గురించి చిరు అడగడం.. బాస్ గురించి వెంకీ అడగడం.. రెండు కూడా క్యాచీ లైన్స్‌తో సాగాయి. ఏంటి బాస్ సంగతి అని వెంకటేష్ చిరంజీవిని అడిగితే...అదిరిపోద్దీ సంక్రాంతి అని చెప్పగా...ఏంటి వెంకీ సంగతి అని చిరు వెంకటేష్ ను అడిగితే ఇరగదీద్దాం సంక్రాంతి అంటూ సమాధానం ఇస్తాడు. ఇద్దరూ హీరోలకు సరిపోయేలా కాసర్ల శ్యామ్ మంచి లిరిక్స్ అందించారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Next Story
Share it