వాల్తేర్ వీరయ్య వెటకారం
తాను వాళ్ళను విమర్శించటం లేదు అంటూనే తన పని తాను పూర్తి చేశారు. అయితే చిరంజీవికి ఈ వెబ్ సైట్ రేటింగ్స్ ఒకింత ఆగ్రహం తెప్పించానే విషయం తాజాగా అయన మాటల్లో బయటపడింది. అయితే యూఎస్ లో చిరంజీవి సినిమా ఇప్పటికి రెండు మిలియన్ల క్లబ్ లో చేరటంతో పాటు ఇంకా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేర్ వీరయ్య సినిమా సుమారు 200 కోట్ల రూపాయాల గ్రాస్ తో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, రవి తేజ నటించిన విషయం తెలిసిందే. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా చిరంజీవి నటన, కామెడీ లతో అటు అభిమానులతో పాటు ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం తో పండగ వసూళ్ళలో ఈ సినిమానే ముందు ఉంది.