దివికి సినిమా ఆఫర్ ఇప్పించిన చిరంజీవి
బిగ్ బాస్ ఫైనల్ గేమ్ కు ముఖ్యఅతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి వేదిక మీద నుంచే పలు నిర్ణయాలు ప్రకటించారు. అందులో ఒకటి ఈ షోలో పాల్గొన్న దివి వైద్యకు సినిమా ఛాన్స్ ఇవ్వమని తన డైరక్టర్ మెహర్ రమేష్ కు సిఫారసు చేశాడు. అయితే ప్రస్తుతానికి ఆమెకు పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నామని..దివ్య గ్లామర్ ను ఉద్దేశించి ఆమెకు ఇతర కీలక పాత్రలు కూడా ఇవ్వొచ్చని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తమిళ్‌లో అజిత్ హీరోగా సూపర్‌హిట్‌గా నిలిచిన 'వేలాయుధం' సినిమాను తెలుగులో రిమేక్ చేయనున్నారు. చిరు హీరోగా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దీంతోపాటు సోహైల్ తీసే చిన్న బడ్జెట్ సినిమాలో తనకు ఓ పాత్ర ఇవ్వాలని..అందులో తాను నటిస్తానని ప్రకటించి సోహైల్ ను షాక్ కు గురిచేశారు. చిరంజీవి ప్రకటనతో సోహైల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చిరంజీవి తన ఇంటి దగ్గర నుంచి సోహైల్ అండ్ టీమ్ కు ప్రత్యేకంగా బిర్యానీ చేయించుకుని తీసుకురావటం షో చూసే వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరో కంటెస్టెంట్ మొహబూబ్ కు వేదిక మీదే చిరంజీవి పది లక్షల రూపాయల చెక్ రాసిచ్చారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా సోహైల్ అనాథ ఆశ్రమానికి ఇస్తానన్న పది లక్షల రూపాయలను తానే ఇస్తానని..సోహైల్ దక్కించుకున్న 25 లక్షల రూపాయలను ఇంటికి తీసుకెళ్ళమని సూచిస్తాడు. ఇలాంటి ట్విస్ట్ లతో బిగ్ బాస్ షో ముగిసింది. అయితే విజేత అభిజిత్ కు ప్రైజ్ మనీలో కోత వేసిన వ్యవహారం దుమారం రేపుతోంది. వాస్తవానికి అభిజిత్ కు ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా..25 లక్షల రూపాయలతోనే సరిపెట్టారు. దీంతో అభిజిత్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.