Telugu Gateway
Cinema

వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి కొత్త సినిమా

వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి కొత్త సినిమా
X

మెగాస్టార్ చిరంజీవి కుర్రహీరోల కంటే చాలా స్పీడ్ మీద ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు లైన్లో ఉండ‌గా..మ‌రో కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమాకు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా..డీవీవీ బ్యాన‌ర్ పై దాన‌య్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. స‌హ నిర్మాతగా డాక్ట‌ర్ మాధ‌వి రాజు ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. చిరంజీవితో సినిమా ప్ర‌క‌ట‌న చేయ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌ని డీవీవీ మూవీస్ పేర్కొంది. ఇప్ప‌టికే చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు నటించిన ఆచార్య మూవీ పూర్త‌వ‌గా, ఓ వైపు భోళా శంక‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది..దీంతోపాటు గాడ్ ఫాద‌ర్ తోపాటు మెగా 154 వంటి సినిమాలు కూడా లైన్ లో ఉన్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it