Telugu Gateway
Cinema

చిరంజీవి సినిమా జనవరి 12 న

చిరంజీవి సినిమా జనవరి 12 న
X

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ ఫిక్స్ అయిపోయాయి. ఇప్పటికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాజాసాబ్ సినిమా జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత టి జీ విశ్వప్రసాద్ పలు మార్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” రిలీజ్ డేట్ ను కూడా శనివారం నాడు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఈ విషయాన్ని మీడియా తో షేర్ చేసుకున్నారు.

ఈ సినిమాలో చిరజనీవికి జోడిగా నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. సంక్రాంతి రేస్ లోనే ఉన్న అనగనగ ఒక రోజు...నారీ నారీ నడుమ మురారి సినిమాలు జనవరి 14 న ఉదయం ఒకటి..సాయంత్రం ఒకటి విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వచ్చే సినిమాల డేట్స్ అన్ని లాక్ అయిపోయినట్లే. ఇక మిగిలింది రవితేజ హీరోగా నటిస్తున్న భర్త మాయాశయులకు విజ్ఞప్తి మూవీ ఒక్కటే. ఇది సంక్రాంతి రేస్ లో ఉంటుందా..పక్కకు తప్పుకుంటుందా అన్నది చూడాలి.

Next Story
Share it