పదవుల కోసం గొడవలొద్దు
మా ఎన్నికల ఫలితాల అనంరతం మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. పెళ్లిసందడి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా ఆయన స్పందించారు. ఆదిపత్యం చూపించుకునేందుకు, ఇతరులను కించపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు. రెండేళ్లు, నాలుగేళ్ళు ఉండే పదవుల కోసం మన పరువు మనం తీసుకోవద్దని..ఇది ఎవరో ఒకరిని ఉద్దేశించి చెబుతున్న మాటలు కాదన్నారు. వాళ్ళు అన్నారు కాబట్టి మేం అంటున్నాం అన్నట్లు కాకుండా అసలు సమస్యకు మూలం ఎక్కడ ఉందో చూడాలన్నారు.
ఏది ఏమైనా మనం అందరూ కలిసికట్టుగా ఉండాలి, మనదంతా ఒక వసుదైక కుటుంబం అని వ్యాఖ్యానించారు. మనల్ని మనం తిట్టు కోవడంతో బయటి వ్యక్తులకు మరింత చులకనగా మారతాము, ఇది అవసరమా అని ప్రశ్నించారు. ముఖ్యంగా మీడియాకు ఆహారంగా మారవద్దు అని సలహా ఇచ్చారు. పరిశ్రమలో ఆరోగ్యకర వాతావరణం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పెళ్లిసందడి సినిమా ఆ సినిమా అంత విజయం సాధించాలని ఆకాంక్షించారు.