'చెక్' ట్రైలర్ విడుదల
BY Admin3 Feb 2021 1:04 PM GMT
X
Admin3 Feb 2021 1:04 PM GMT
భీష్మ సినిమా హిట్ తో జోష్ లో ఉన్నాడు హీరో నితిన్. ఇప్పుడు 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుధవారం నాడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. అదే సమయంలో విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. 'చెక్' సినిమా ఫిబ్రవరి 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తే చదరంగం ఆట...జైలు సీన్లతోనే ట్రైలర్ కట్ చేశారు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా కన్పించబోతున్నారు. నితిన్ ప్రేమికురాలిగా ప్రియా వారియర్ సందడి చేయనుంది. 'రాజును ఎదిరించే దమ్ము ఉందా సిపాయికి. యుద్ధం మొదలుపెట్టేది సిఫాయే. ' వంటి పవర్ ఫుల్ డైలాగ్ లు ట్రైలర్ లో ఉన్నాయి. చెక్ తోపాటు మరో వైపు నితిన్, కీర్తిసురేష్ లు జంటగా నటించిన 'రంగ్ దే' సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది.
Next Story