Telugu Gateway
Cinema

'చెక్' మూవీ రివ్యూ

చెక్ మూవీ రివ్యూ
X

భీష్మ హిట్ తర్వాత నితిన్ కొత్త సినిమా కావటంతో 'చెక్'పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులోనూ తన కన్నుగీటుతో దేశమంతటా సంచలనం సృష్టించిన ప్రియాప్రకాష్ వారియర్ ఈ సినిమా ద్వారా తొలిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తొలిసారి హీరోయిన్ గా కాకుండా...లాయర్ పాత్రలో ఈ సినిమాలో నటించటం కూడా మరో ఆసక్తికర అంశంగా మారింది. ఇన్ని విశేషాల మధ్య ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అసలు కథ విషయానికి వస్తే ఓ ఉగ్రదాడి. అందులో నలభై మంది ప్రాణాలు కోల్పోవటం. ఈ దాడికి కారణమైన ఐదుగురిని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తుంది. కోర్టు ఈ ఐదుగురికి ఉరిశిక్ష వేస్తుంది. అందులో దాడితో ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఆదిత్య(నితిన్) కూడా ఉంటాడు. అప్పీల్ చేసుకుని తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉగ్రవాదిగా జైలు జీవితం గడుపుతాడు. సైబర్ నేరాలు చేసే ఆదిత్యకు అసలు ఉగ్రదాడితో సంబంధం ఏంటి?. ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు. అందులో నుంచి ఎలా బయటపడ్డాడు. ఆదిత్య ఈ కేసులో ఇరుక్కోవటానికి యాత్ర (ప్రియాప్రకాష్ వారియర్) ఎలా కారణం అవుతుంది. జైలులో ఉంటూ చెస్ ఆటగాడిగా ఆదిత్య ఎలా మారతాడు.

జైలులో ఉంటూనే ఏకంగా ఏకంగా ప్రపంచ చెస్ చాంఫియన్ విశ్వనాధ్ ఆనంద్ వంటి క్రీడాకారుడిని ఓడిండగలిగే స్థితికి చేరటం ఎలా అన్నదే ఈ చెక్ మూవీ. సినిమా ఎక్కువ భాగం జైలులోనే సాగుతుంది. అందులోనూ నితిన్, సాయి చంద్, హర్ష వర్ధన్ ల చుట్టూనే తిరుగుతుంది. అయితే సినిమాలో నితిన్ పేరుకు ఉగ్రవాది అనే తప్ప..అంతా చెస్ ఆటగాడినే కన్పిస్తాడు. చెస్ లో మెళకులు నేర్పి అదే జైలులో ఉండే సాయి చంద్ గురువుగా కీలక పాత్ర పోషించాడు. సీరియస్ గా సాగే సినమాలో అప్పుడప్పుడు హర్షవర్ధన్ కామెడీ ఊరటనిస్తుంది. సినిమాలో ట్విస్ట్ లు ఆసక్తికరంగానే సాగుతాయి. హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర సినిమాలో కన్పించేది అతి తక్కువ సమయమే. లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రకు న్యాయం చేసింది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సినిమాను ఆసక్తికరంగానే తెరకెక్కించారు. అయితే ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కోరుకునే రెగ్యులర్ సినిమా ప్రేక్షకుల ఏ మేరకు కనెక్ట్ అవుతుందో వేచిచూడాల్సిందే.

రేటింగ్. 2.75/5

Next Story
Share it