Telugu Gateway
Cinema

రోషన్ కు ఈ సారి అయినా హిట్ దక్కిందా?!

రోషన్ కు  ఈ సారి అయినా హిట్ దక్కిందా?!
X

రోషన్ హీరోగా చేసింది ఇప్పటికి మొత్తం మూడు సినిమాలే. మూడవ సినిమానే గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఛాంపియన్ మూవీ. గతంలో ఈ హీరో నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందడి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఛాంపియన్ మూవీ ని నిర్మించింది స్వప్న మూవీస్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినీ కుటుంబం నుంచి రావటమో..నటనపై ఇంటెరెస్టో తెలియదు కానీ...శ్రీకాంత్, ఊహల కొడుకు రోషన్ నటలో మొదటి నుంచి ఎంతో ఈజ్ ఉంది. ఛాంపియన్ సినిమాతో ఇది మరింత మెరుగైంది అనే చెప్పొచ్చు. క్రిస్మస్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలే క్యూ కట్టినా కూడా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో ఛాంపియన్ ఒకటి. ఇక ఈ సినిమా కథ ఏంటి హీరో కు ఫుట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా సరే ఇంగ్లాండ్ మాంచెస్టర్ ఫుట్ బాల్ జట్టులో చోటు దక్కించుకుని ఆ టీం తరపున ఆడటమే లక్ష్యంగా పెట్టుకుంటాడు.

కానీ ఆ టీంలో చోటు దక్కే ఛాన్స్ వచ్చినా తండ్రి బ్యాగ్రౌండ్ కారణంగా హీరో కు ఆ ఛాన్స్ మిస్ అవుతుంది. కానీ ఎలాగైనా లండన్ వెళ్ళటానికి అక్రమ మార్గం ఎందుకుంటాడు. ఒక ఫ్రెండ్ సాయంతో అక్రమంగా ఆయుధాలు ఒక చోటకు చేర్చి...వాళ్ళ ద్వారా లండన్ వెళ్ళటానికి ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో ఆయుధాలు తీసుకువెళ్లే ట్రక్ పోలీస్ ల నుంచి తప్పించుకోవటానికి బైరాన్ పల్లి అనే గ్రామానికి వెళుతుంది. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. బైరాన్ పల్లి లో ఇరుక్కుపోయిన హీరో ఆ గ్రామం కోసం ఎందుకు పోరాడతాడు....మరి హీరో లండన్ వెళ్లి తాను కోరుకున్నట్లు ఫుట్ బాల్ మ్యాచ్ అడగలిగాడా లేదా అన్నదే ఈ ఛాంపియన్ మూవీ. ఫుట్ బాల్ ఆటకు...ఇండియాకు స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉండి ఎదురుకొన్న ఇబ్బందులు...నిజాం పాలకులకు...రజాకారులకు వ్యతిరేకంగా బైరాన్ పల్లి గ్రామస్థులు చేసిన పోరాటంతో లింక్ చేసి కథను నడిపించాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం.

ఛాంపియన్ సినిమాలో రోషన్ కు దక్కింది ఎంతో కీలకమైన పాత్ర. నటన పరంగా తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ అనస్వర రాజన్ అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ బాగానే సెట్ అయింది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో తప్ప స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్లో గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. అక్కడక్కడా భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల కంట తడి పెట్టిస్తాయి. నిజాం ప్రభుత్వంతో ఒక గ్రామం చేసిన పోరాటమే ఈ మూవీ లో హై లైట్ గా నిలిచింది అని చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ మూవీ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒక కీలక పాత్రలో కనిపించారు. ఇతర కీలక పాత్రల్లో మురళి శర్మ, వెన్నెల కిషోర్ లు కనిపిస్తారు. ఈ సినిమాల్లో కీలక నటీనటులు యాక్షన్ బాగానే ఉన్నా కూడా ఇందులో ప్రేక్షకులు కోరుకునే జోష్ మిస్ అయింది.

రేటింగ్ : 2.5 -5

Next Story
Share it