'చావు కబురు చల్లగా' పాట విడుదల
పుట్టుక..చావుల గురించి ఈ పాట ఎంతో చక్కగా చెప్పింది. పుట్టుకతో పాటు చావును కూడా అంతే తేలిగ్గా తీసుకోవాలంటోంది. అదే కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావుకబురు చల్లగా'లోని పాట. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో 'బన్నీ' వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో 'బస్తీ బాలరాజు'గా కార్తికేయ, 'మల్లిక' పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు.
' మైనేమ్ ఈజ్ రాజు... చస్తే ఏటైపోతుంది'అంటూ సాగే ఈ పాట చావు, పుట్టుకల సారాన్ని ఎంతో చక్కగా వివరించింది. ప్రముఖ సింగర్ రేవంత్ ఆలపించిన ఈ పాటకు కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. సినిమాలో బస్తీబాలరాజు అనే క్యారెక్టర్ లో కార్తికేయ ఊర మాస్ క్యారెక్టర్ చేసినట్లు కన్పిస్తోంది. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.