Telugu Gateway
Cinema

'రంగ రంగ వైభవంగా' అంటున్న వైష్ణ‌వ్ తేజ్

రంగ రంగ వైభవంగా అంటున్న వైష్ణ‌వ్ తేజ్
X

వైష్ణ‌వ్ తేజ్ దూకుడు పెంచారు. వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఇప్ప‌టికే తొలి సినిమా ఉప్పెన‌తో సూప‌ర్ స‌క్సెస్ అందుకున్న ఈ హీరో కొండ‌పొలంతో కూడా ఓకే అన్పించుకున్నాడు. సోమ‌వారం నాడు మూడ‌వ సినిమాను ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో వైష్ణ‌వ్ తేజ్ కు జోడీగా కేతిక శ‌ర్మ న‌టిస్తోంది. ఈ సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే వెరైటీ టైటిల్‌కు ఫిక్స్‌ చేశారు.

గిరీశాయ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. టైటిల్ ప్ర‌క‌ట‌న‌తోపాటు టైటిల్‌ టీజర్‌ను కూడా విడుద‌ల చేశారు. అమ్మాయిలు ట్రీట్‌ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్‌ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇస్తుంది హీరోయిన్ ఇందులో. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శామ్‌దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Next Story
Share it