Telugu Gateway
Cinema

ఆకట్టుకుంటున్న ‘బ్రో’ టీజర్

ఆకట్టుకుంటున్న ‘బ్రో’  టీజర్
X

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటిస్తున్న సినిమానే ‘బ్రో’.ఈ సినిమా జులై 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. అందులో భాగంగానే గురువారం నాడు ‘బ్రో’ టీజర్ విడుదల చేసింది. ఇది తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ సితంకు రీమేక్ అయినా పవన్ కళ్యాణ్ ఫాన్స్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేసినట్లు చెపుతున్నారు. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు, నటుడు సముద్ర ఖని తెలుగులోనూ ఈ సినిమాను తెరకెక్కించారు.

‘ ఏంటి ఇది ఇంత చీకటిగా ఉంది. పవర్ లేదా?. ఏమండీ ఎవరు లేరా?.హలో మాస్టారు. గురువు గారు..తమ్ముడు...బ్రో అంటూ సాయి ధరమ్ తేజ్ డైలాగులతో టీజర్ స్టార్ట్ అయితే అప్పుడే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. వెల్ కం అమ్మా వెల్ కం. కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం. సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగు ఇందులో హై లైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it