Telugu Gateway
Cinema

బ్రో కలెక్షన్స్ ...అంచనాలు అందుకున్నాయా?

బ్రో కలెక్షన్స్ ...అంచనాలు అందుకున్నాయా?
X

పవన్ కళ్యాణ్ సినిమా ల రేంజ్ తో పోలిస్తే బ్రో ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఆశాజనకంగా లేవనే చెప్పాలి. బ్రో కంటే ముందు రిలీజ్ అయిన భీమ్లా నాయక్ కు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల రూపాయలపైన గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు బ్రో సినిమా కు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 48 .50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. నికర వసూళ్లు 30 కోట్ల రూపాయలుగా ఉంది. బ్రో సినిమాలో కథ అంతా సాయి ధరమ్ తేజ్ మీద సాగుతుంది....కాకపోతే ఆ కథను నడిపించేది మాత్రం అంతా పవన్ కళ్యాణ్ మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు తొలిసారి కలిసి నటించారు. అదే సమయంలో ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం కు ఇది రీమేక్ కావటంతో అంచనాలు పెరిగాయనే చెప్పాలి.

ఆ సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు సముధ్రఖని ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తే...దీనికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అదనపు హంగులు అద్దారు...అక్కడక్కడ తనదైన స్టైల్ డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శని, ఆదివారాలు బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండటంతో తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

Next Story
Share it