Telugu Gateway
Cinema

షారుఖ్ ఖాన్ ఆస్తులు 6142 కోట్లు

షారుఖ్ ఖాన్ ఆస్తులు 6142 కోట్లు
X

భారత్ నుంచి అయన దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ బాలీవుడ్ హీరో హాలీవుడ్ హీరోలతోనే పోటీ పడుతున్నారు తప్ప...ఇక్కడ ఆయనకు దగ్గరలో కూడా ఎవరూ లేనట్లు లెక్కలు చెపుతున్నాయి. ప్రపంచంలోనే షారుఖ్ ఖాన్ నాల్గవ సంపన్న హీరోగా నిలిచారు. అయన సంపద మొత్తం 770 మిలియన్ల యూ ఎస్ డాలర్స్. అదే భారతీయ కరెన్సీలో అయితే ఇది ఏకంగా 6142 కోట్ల రూపాయలుగా ఉంది. షారుఖ్ ఖాన్ ఏడాదికి సుమారు 304 కోట్ల రూపాయలు సంపాదిస్తారనే అంచనా. అటు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కు కూడా ఈ బాలీవుడ్ హీరో అంబాసడర్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఒక్క సినిమా కు షారుఖ్ ఖాన్ వంద నుంచి 120 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటారని అంచనా. ఈ హీరో కు దుబాయిలో కూడా అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతాల్లో ఖరీదైన విల్లాలు ఉన్నాయి.

ప్రపంచంలోని సంపన్న నటుల్లో మొదటి స్థానంలో హాలీవుడ్ యాక్టర్ జెర్రీ సీన్ ఫీల్డ్ ఉన్నారు. అయన ఆస్తుల విలువ ఏకంగా 8000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. తర్వాత స్థానంలో టైలర్ పెర్రీ ఆస్తులు కూడా ఒక బిలియన్ డాలర్స్. డానీ జాన్సన్ ఆస్తులు సుమారు 6400 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. నాల్గవ స్థానం లో ఇండియా నుంచి ఉన్న ఒకే ఒక హీరో షారుఖ్ ఖాన్ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో అత్యంత అధిక పారితోషకం తీసుకునే టామ్ క్రూజ్ కంటే షారుక్ ఖాన్ ఆస్తులు ఎక్కువ ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. ఈ హీరో గత మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా జనవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story
Share it