జియో హాట్ స్టార్ లో కొత్త లోక మూవీ

ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో రికార్డు లు తిరగరాసిన సినిమా కొత్త లోక చాప్టర్ వన్. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే ఇది ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే సమయంలో మలయాళంలో ఉన్న గత రికార్డులు అన్ని కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో చిత్ర యూనిట్ ఓటిటి డేట్ ను అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది . తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా ఇది స్ట్రీమింగ్ కానుంది . ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో ఇందులో కీలక పాత్ర పోషించిన కళ్యాణి ప్రియదర్శిని ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే చెప్పాలి. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నస్లీన్ నటించాడు . బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటిటి లో ఎన్ని రికార్డు లు నమోదు చేస్తుందో చూడాలి .



