Telugu Gateway
Cinema

నాన్ స్టాప్ బిగ్ బాస్ డేట్ వ‌చ్చేసింది

నాన్ స్టాప్ బిగ్ బాస్ డేట్ వ‌చ్చేసింది
X

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే బిగ్ బాస్ కార్య‌క్ర‌మం మ‌ళ్లీ ప్రారంభం కానుంది. అంతే కాదు..ఇది నాన్ స్టాప్ అంటూ ఈ షో నిర్వాహ‌కులు మంగ‌ళ‌వారం నాడు ప్రొమోను విడుద‌ల చేశారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో ఇది ప్ర‌సారం కానుంది. ఈ ప్రొమోలో నాగార్జున‌తోపాటు వెన్నెల కిషోర్, ముర‌ళీశ‌ర్మ‌లు చేసిన సంద‌డి ఆక‌ట్టుకునేలా ఉంది. అంతే కాదు..నాన్ స్టాప్ బిగ్ బాస్ పై అంచ‌నాలను పెంచింది. మ‌రి షోలో కంటెంట్ ప్రొమోలో ఉన్నంత స‌ర‌దాగా ఉంటుందా.. లేక టీవీలో వ‌చ్చిన త‌ర‌హాలోనే బోర్ కొట్టిస్తుందా అన్న‌ది కొంత కాలం పోతే కానీ తెల‌వ‌దు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రొమోలో ఉన్న స‌ర‌దా స‌న్నివేశాలు మాత్రం ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

లాయ‌ర్ గా క‌న్పించిన నాగార్జున జైలు అధికారులు తీసుకెళుతున్న వెన్నెల కిషోర్ ను ఎక్క‌డికి వెళుతున్నావు అంటే ఉరేయించుకోవ‌టానికి అంటూ సీరియ‌స్ గా చెబుతాడు. ఉరిశిక్ష ప‌డిన వెన్నెల కిషోర్ కు చివ‌రి కోరిక ఏమిటి అని అడిగితే ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్ అయిన నాగార్జున బిగ్ బాస్ తొలి ఎపిసోడ్ చూసి చ‌చ్చిపోవాల‌ని త‌న కోరిక అని చెబుతాడు. కానీ అది ఎంత‌కూ పూర్తి కాదు. త‌ర్వాత జైల‌ర్ తోపాటు జైలులో ఉన్న సిబ్బంది అంద‌రూ క‌ల‌సి కూర్చుని షో చూస్తారు. ఆ వెంట‌నే నాగార్జున వ‌చ్చి నో కామా ..నో పుల్ స్టాప్ ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్ అంటూ చూస్తూ ఉండండి 24 గంట‌లూ ఎంట‌ర్ టైన్ మెంట్ అంటూ ముగిస్తాడు.

Next Story
Share it