Telugu Gateway
Cinema

బిగ్ బాస్ 5 తెలుగు విజేత స‌న్నీ

బిగ్ బాస్ 5 తెలుగు విజేత స‌న్నీ
X

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5హంగామా ముగిసింది. ఆదివారం అట్ట‌హాసంగా సాగిన కార్య‌క్ర‌మంలో విజేత ఎవ‌రో తేలిపోయింది. ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున చాలా మంది ప్ర‌త్యేక అతిథుల‌నే తీసుకొచ్చాడు ఈసారి. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ టీమ్ లు కూడా ప్ర‌త్యేకంగా దిగాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా ముగించేందుకు ప్ర‌య‌త్నించారు. అందుకే ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళితోపాటు బాలీవుడ్ హీరో, హీరోయిన్లు ర‌ణ్ బీర్ క‌పూర్, అలియాభ‌ట్ తోపాటు బ్ర‌హ్మ‌స్త్ర ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ కూడా హాజ‌రయ్యారు. వీరితోపాటు శ్యామ్ సింగ‌రాయ్ టీమ్...ఫ‌రియా అబ్దుల్లా కూడా బిగ్ బాస్ 5 ముగింపులో పాల్గొని సంద‌డి చేసింది. గ‌త సీజ‌న్ తో పోలిస్తే బిగ్ బాస్ 5 సీజ‌న్ చాలా డ‌ల్ గానే సాగింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

ఏది ఏమైనా షో ముగిసింది..విజేత ఎవ‌రో తెలిసింది. బిగ్‌బాస్ షో తెలుగు విజేతగా ఖ‌మ్మంకు చెందిన అరుణ్‌ రెడ్డి (సన్నీ) విజేతగా నిలిచారు. -స‌న్నీ తొలి నుంచి హౌస్ లో త‌న స‌త్తా చాటుకుంటూ విజేత‌గా నిలిచాడు. చాలా మంది ఈ విష‌యాన్ని ముందే ఊహించారు. హౌస్ లో అతను వ్య‌వ‌హ‌రించిన తీరు..ఇత‌ర అంశాల‌ను స‌న్నీని విజేత‌గా నిల‌బెట్టాయి. బిగ్‌బాస్‌ 5 రన్నరప్‌గా షణ్ముక్‌ జశ్వంత్‌ నిలిచారు. టాప్‌-5 వరకు సిరి, మానస్‌, శ్రీరామచంద్ర బ‌రిలో నిలిచారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొన్నారు. ఎన్నో టాస్కులతో, మరెన్నో ఉద్వేగ భరితమైన ఘట్టాలతో, డ్యాన్సులతో, హంగామా దాదాపు 104 రోజుల పాటు అలరించిన ఈ షో ఆదివారంతో ముగిసింది.

Next Story
Share it