Telugu Gateway
Cinema

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ముహుర్తం ఫిక్స్

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ముహుర్తం ఫిక్స్
X

బిగ్ బాస్ సంద‌డి మ‌ళ్లీ షురూ కానుంది. దీనికి ముహుర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబ‌ర్ 5 సాయంత్ర ఆరు గంట‌ల‌కు బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ప్రారంభం కానుంది. ఈ సారి కూడా అక్కినేని నాగార్జునే కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు తీసుకుంటున్నారు. బోర్ డ‌మ్ కు గుడ్ బై..సంద‌డి ప్రారంభం అంటూ మా టీవీ బిగ్ బాస్ తెలుగుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ప్రారంభం తర్వాత ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. త్వరలోనే ఈ షోలో పాల్గొనబోయే సభ్యుల వివరాలు తెలియజేయనున్నారు.

అయితే ఇప్ప‌టికే ప‌లుపేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అందులో నిజం ఏంతో తేలాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ వేచిచూడాల్సిందే. అయితే ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్న పేర్లు ఇలా ఉన్నాయి. అయితే ఇందులో ఏదీ అధికారికం కాదు. ఈ సారి జాబితాలో యాంకర్ రవి, నటి ప్రియా, యాంకర్ వర్షిణి, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్య స్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి.

Next Story
Share it