బిగ్ బాస్ సీజన్ 5..'చెత్తబుట్టల్లో నామినేషన్లు'
చెత్తబుట్టలు. అందుల్లో కంటెస్టెంట్ల ఫోటోలతో కూడిన బ్యాగ్ లు విసిరేయటం. హౌస్ లోని సభ్యులు ఎందుకు నామినేట్ చేస్తున్నారో ఎవరి రీజన్ వారు చెప్పి ఆ పనిచేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి అది ఎలా ఉందో తెలియదు కానీ..చూసేవాళ్లకు మాత్రం ఈ చెత్తబుట్టల వ్యవహారం చాలా ఇబ్బందిగానే అన్పించింది. బిగ్ బాస్ అంటేనే ఇలాంటి చెత్త వ్యవహారాలు చాలా ఉంటాయనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయినా చూసేవారు చూస్తున్నారు. చేసేవారు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో తొలి రోజు అంటే సోమవారం నాడు ఎప్పటిలాగానే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ముందుగా సింగర్ శ్రీరామచంద్ర.. మానస్, జెస్సీలను నామినేట్ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్, యాంకర్ రవిని, శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్, జెస్సీలను నామినేట్ చేశారు.
మానస్.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్, లహరిని; ప్రియాంక సింగ్.. షణ్ముఖ్, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్.. విశ్వ, సరయూలను; కాజల్.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్ చేశారు. ఎక్కువ ఓట్లు పడిన రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. మరి వీరిలో ఎలిమినేషన్ గండం గట్టెక్కేది ఎవరనేది వీకెండ్ లో తేలనుంది. అట్టహాసంగా ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజీన్ 5 తెలుగులో ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. సరయూని పోటీదారుల జాబితాలో చేర్చటంతో మా టీవీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.