టాలీవుడ్ లో ఇక సందడే సందడి

సెప్టెంబర్ 28 న అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కావటం, హీరో ప్రభాస్ కావటంతో దీనిపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సంక్రాంతి లాగానే దసరాకు కూడా ఈ సారి బాలకృష్ణ కొత్త సినిమా విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఉన్నారు. మరుసటి రోజే అంటే అక్టోబర్ 20 న రవితేజ హీరో గా నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా విడుదల కానుంది. హీరో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 21 న రానుంది. వెంకటేష్ హీరో గా నటించిన సైంధవ్ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షుల ముందుకు రాబోతోంది. హీరో వెంకటేష్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. భారీ అంచనాలు ఉన్న పుష్ప 2 డిసెంబర్ లో ప్రేక్షుకుల ముందుకు వస్తుందా లేక కొత్త సంవత్సరమేనా అన్నది తేలాల్సి ఉంది.