Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ను తగ్గాల్సిందే అన్న రష్యా !

అల్లు అర్జున్ ను తగ్గాల్సిందే అన్న రష్యా !
X

పుష్ప లో పాపులర్ డైలాగు తగ్గేదే లే. కానీ రష్యా సినిమా అభిమానులు మాత్రం తగ్గాలిసిందే అన్నారట. దీంతో అవాక్కు అవటం పుష్ప యూనిట్ వంతు అయింది. పుష్ప ది రైజ్ సినిమా దేశంలో చేసిన హంగామా ఇంతా అంతా కాదు. చిత్ర యూనిట్ కూడా ఊహించని విజయాన్ని అందుకుంది ఈ మూవీ . వసూళ్లలో కూడా దుమ్ము రేపింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నలు నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో పాటలు...ఎర్రచందనం స్ముగ్గ్లింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు..అల్లు అర్జున్ మేనరిజం సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇది అంతా పాత సంగతి. ఇటీవలే చిత్ర యూనిట్ పుష్ప ది రైజ్ సినిమాను రష్యా లో కూడా డబ్బింగ్ చేసిన విడుదల చేశారు. దీనికోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా అక్కడ హంగామా చేశారు. భారీ ఎత్తున ప్రోమోషన్ చేశారు. మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు.

అయితే రష్యాలో ఈ సినిమా దారుణంగా విఫలమైంది అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. విడుదల అయినా మొదటి మూడు రోజుల్లోనే థియేటర్ల నుంచి సినిమా ను తీసేసినట్లు చెపుతున్నారు. ఇక్కడ రిలీజ్ చేయటం ద్వారా ప్రొమోషన్స్ కు పెట్టిన ఖర్చు కూడా రాలేదని టాక్. రష్యా మార్కెట్ మూడ్ ను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అక్కడ పుష్ప విడుదల చేయటం వల్లే ఈ పరిస్థితి అని చెపుతున్నారు. సరైన అంచనాలు లేకుండా వెళ్లి దారుణంగా దెబ్బతిన్నారని పరిశ్రమలో చర్చ సాగుతోంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా మంది యువత దేశం వదిలిపెట్టడానికి కూడా రెడీ అయ్యారు..ఎందుకు అంటే ఆ దేశ ప్రెసిడెంట్ పుతిన్ సైన్యానికి తోడు ప్రజలను కూడా యుద్ధంలో పాల్గొనాలని కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ మరో విషయాన్నీ ప్రస్తావించుకోవాలి. కొద్ది రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో విడుదల చేశారు. అయితే అక్కడ ఈ సినిమా వసూళ్లు బాగా ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. కానీ రష్యాలో మాత్రం పుష్ప కు చేదు అనుభవం ఎదురైంది.



Next Story
Share it