చిరుకు గాడ్ ఫాదర్ షాక్..ఆచార్య కంటే తక్కువ కలెక్షన్లు!

ఆచార్య దర్శకుడు కొరటాల శివ కావటం, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉండటం తొలి రోజు వసూళ్లు మెరుగ్గా ఉండటానికి కారణమైందని పరిశ్రమ వర్గాలుచెబుతున్నాయి. కానీ గాడ్ పాదర్ విషయానికి వచ్చేసరికి సల్మాన్ ఖాన్ ఉన్నా కూడా ఇది ఏమీ పెద్దగా కలసి రాలేదనే చెప్పొచ్చు. రెండవ రోజు అంటే గురువారం నాడు ముఖ్యంగా ఏపీలో కలెక్షన్ల వీక్ గా ఉన్నట్లు సమాచారం. లూసిఫర్ తో పోలిస్తే గాడ్ ఫాదర్ బాగాలేదనే టాక్ వచ్చినా..ఓవరాల్ గా చూస్తే మాత్రం గాడ్ ఫాదర్ కు పాజిటివ్ టాక్ వచ్చేంది. కానీ వసూళ్ల పరంగా చూస్తే మాత్రం వీక్ గా ఉండటంతో చిరు టీమ్ టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం.