Telugu Gateway
Cinema

సంక్రాంతి సందడికి అంతా సిద్ధం

సంక్రాంతి సందడికి అంతా సిద్ధం
X

ఒకటి కాదు...రెండు కాదు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా ఐదు సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఎప్పుడైనా కొన్ని సినిమాలపైనే అంచనాలు భారీ ఉంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ హీరో గత సినిమాలు...డైరెక్టర్ ట్రాక్ రికార్డు..నిర్మాణ సంస్థ. ఇవి అన్నీ కూడా ప్రభావం చూపించే అంశాలే. కానీ విచిత్రంగా ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ఐదు సినిమాల్లో ఐదూ కూడా ఎక్కడా తగ్గకుండా అంచనాలు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదల అయిన పాటలు ...టీజర్లు కూడా ఆయా సినిమాలపై అంచనాలు పెంచాయే తప్ప...ఎక్కడా అనుమానం కలిగించలేకపోయాయి. దీంతో ఈ సంక్రాంతి రేస్ పోటీ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎంతో ఆసక్తికరంగా మారింది అనే చర్చ సాగుతోంది. టాలీవుడ్ వర్గాలు సైతం ఇప్పుడు ఒక సైడ్ తీసుకుని ఇది మాత్రమే బాగుండేలా ఉంది అని బహిరంగం గా చెప్పే పరిస్థితి లేదు అనే చెప్పొచ్చు.

ఈ సంక్రాంతికి బోణి కొడుతున్నది పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా రాజాసాబ్. గత యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించటంతో పాటు ఫస్ట్ టైం హారర్ కామెడీ మూవీ లో సందడి చేయబోతున్నాడు. దర్శకుడు మారుతి చేస్తున్న ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే. ఇప్పటి వరకు వచ్చిన రాజాసాబ్ పాటలు...టీజర్ సినిమాకు క్రేజ్ పెంచాయి. రాజాసాబ్ జనవరి తొమ్మిదిన విడుదల అవుతుంటే ....ఆ తర్వాత జనవరి 12 న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి కూడా మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. కారణం ఈ మూవీ ని తెరకెక్కించింది ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరో గా సంక్రాంతి కి వస్తున్నాం సినిమా తో ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏ మాత్రం బజ్ తగ్గకుండా సినిమాను ప్రమోట్ చేయటంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో వెంకటేష్ ఒక అతిధి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. జనవరి 13 న మరో సీనియర్ హీరో రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ , పాటలు కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ముఖ్యంగా రవి తేజ గత సినిమాలకు బిన్నంగా ఇందులో కంప్లీట్ గా న్యూ లుక్ లో కనిపించబోతున్నారు.

ఇక జనవరి 14 న అంటే పండగ రోజు ఏకంగా రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. అది కూడా ఉదయం ఒకటి..సాయంత్రం మరొకటి. జనవరి 14 న నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగ ఒక రాజు సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల ఈ సినిమాలోని రెండు పాటలు మంచి జోష్ నింపాయి. హీరో నీవీన్ పోలిశెట్టి చేస్తున్న ప్రచారం ఈ సినిమా పై అంచనాలను ఒక రేంజ్ కు తీసుకెళ్లింది. అందరి చూపు తన వైపు ఉండేలా చేసుకోవటంలో ఇప్పటికే నవీన్ పోలిశెట్టి సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది టాలీవుడ్ వర్గాల్లో. పండగ రోజు సాయంత్రం శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదల అవుతోంది. ప్రీమియర్ షోస్ కాకుండా ఏకంగా ఒక సినిమా విడుదల ఈవెనింగ్ షోస్ నుంచి అని అధికారికంగా ప్రకటించిన మూవీ బహుశా ఇదేనేమో. ఇలా సంక్రాంతి రేస్ లో ఉన్న ఐదు సినిమాలు కంటెంట్ విషయంలో స్ట్రాంగ్ ఉండి...సక్సెస్ పై ధీమాతో ఉన్నాయి. మరి 2026 సంక్రాంతి రియల్ విన్నర్ ఎవరో తేలాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే. ఆ తర్వాతే అసలు లెక్కలు బయటకు వస్తాయి.

Next Story
Share it