ఒంటి కాలిపై అవినాష్..అమ్మరాజశేఖర్
బిగ్ బాస్ లో కీలక ట్విస్ట్. అనారోగ్యంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన నోయల్ శనివారం నాడు హోస్ట్ అక్కినేని నాగార్జునతో కలసి వేదికపై కన్పించాడు. ఎవరూ ఊహించని రీతిలో అమ్మ రాజశేఖర్, అవినాష్ లపై ఫైర్ అయ్యారు. అంతే కాదు వాళ్లిద్దరిని కాసేపు ఒంటి కాలిపై నిలిచోమన్నాడు. ఆ తర్వాత నొప్పి పుడుతుందా అని ప్రశ్నించి..తనలో పేరుకుపోయిన కోపాన్ని చూపించాడు నోయల్. ఒంటి కాలిపై రెండు నిమిషాలు నిలుచుకోవటానికి ఇబ్బంది పడ్డారు.. 'నేను అనారోగ్యంతో బాధపడుతుంటే దానిపై కామెడీలు చేస్తారా? ఇంత కంటే ఎన్నో రెట్లు పెయిన్ భరించా' అంటూ ఫైర్ అయ్యాడు నోయల్. నాగార్జున మాత్రం కామ్ గా ఇదంతా చూస్తూనే ఉన్నాడు.
ఇంత మంది జనాలు చూస్తుంటే చిల్లర కామెడీలు ఏంది మాస్టర్..జోకరా? మీరు అంటూ అమ్మ రాజశేఖర్ పై మండిపడ్డాడు నోయల్. అమ్మ రాజశేఖర్ ఇది ఎప్పటిదో పాతది అంటూ లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అవినాష్ అయితే మరీ దారుణంగా యాక్ట్ చేసి మరీ చూపించారని ఇది దారుణం అని నోయల్ తప్పుపట్టారు. అయితే అవినాష్ మాత్రం దీనిపై సీరియస్ అయ్యారు. తమను కోట్ల మంది ఆదిరిస్తున్నారని..వెళుతూ వెళుతూ తమను బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్వరంతో ఆరోపించారు. దీనికి కూడా నోయల్ కౌంటర్ ఇస్తూ ఎందుకు అవినాష్ యాక్టింగ్ లు చేస్తున్నావ్ ప్లీజ్ అంటూ అసహనం ప్రదర్శించారు. నెటిజన్లు మాత్రం నోయల్ కే మద్దతు తెలుపుతున్నారు.