Telugu Gateway
Cinema

భోళా శంకర్ మే డే లుక్స్

భోళా శంకర్ మే డే లుక్స్
X

వాల్తేర్ వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపటంతో మెగా స్టార్ చిరంజీవి మంచి దూకుడు మీద ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కు సంబంధించి కొత్త లుక్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్. మే డే ని పురస్కరించుకుని వీటిని విడుదల చేస్తూ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా లో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తుంటే..మరో కీలక పాత్రలో చిరంజీవి కి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య దారుణ అపజయం తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, ఆ వెంటనే వాల్తేర్ వీరయ్య సినిమాలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు.

Next Story
Share it