Telugu Gateway
Cinema

భోళాశంకర్ కు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల వసూళ్లు

భోళాశంకర్ కు తెలుగు రాష్ట్రాల్లో 25  లక్షల వసూళ్లు
X

మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో ఆయనకు ఇంత అవమానం ఎప్పుడూ జరిగి ఉండదు. ఎంత పెద్ద హీరో కు అయినా..హిట్స్..ప్లాప్స్ సహజమే అయినా కూడా భోళా శంకర్ ఎంత పెద్ద డిజాస్టర్ అనేది సోమవారం నాటి కలెక్షన్స్ చెపుతున్నాయి. ఆగస్ట్ 14 న రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ సినిమాకు కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే కలెక్షన్స్ రావటం పరిశ్రమ వర్గాలను షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. ఆచార్య దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న చిరంజీవి కి భోళా శంకర్ మాత్రం తన కెరీర్ లో అత్యంత చేదు అనుభవం మిగిల్చిన సినిమా గా మిగలనుంది. ఇంత పెద్ద సీనియర్ హీరో అయి ఉండి...పరిశ్రమ కదలికలు తెలిసికూడా..ఇంత పేలవమైన సినిమా చిరంజీవి ఎలా చేశాడు అన్నదే ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తున్న అంశం. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ రీమేక్ లు చేస్తే ఏంటి అంటూ ప్రేక్షకులను అయన ప్రశ్నించారు.

పాత చింతకాయపచ్చడితో కూడిన కథలతో రీమేక్ లు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే రీమేక్ అయినా...స్ట్రెయిట్ సినిమా అయినా ప్రేక్షుకుల ఆదరణ పొందుతుంది. కానీ...తాము ఏది చేసినా ప్రేక్షుకులు చూస్తారు అను కుంటే ఫలితాలు ఇలా నే ఉంటాయని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నాలుగు రోజులకు కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 40 .80 కోట్ల రూపాయల గ్రాస్ వస్తే, 25 . 76 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అదే రజనీకాంత్ హీరో గా నటించిన జైలర్ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 347 కోట్ల రూపాయల గ్రాస్, 170 కోట్ల రూపాయల షేర్ సాధించింది. భోళా శంకర్ ఫలితం రాబోయే రోజుల్లో చిరంజీవి కొత్త సినిమాలపై పడే అవకాశం ఉండి అని చెపుతున్నారు.

Next Story
Share it