Telugu Gateway
Cinema

చిరంజీవికి దెబ్బ పడింది

చిరంజీవికి దెబ్బ పడింది
X

మెగా స్టార్ చిరంజీవి వరస విజయాలకు భోళా శంకర్ బ్రేకులు వేసింది. చివరకు ఫాన్స్ కూడా భోళా శంకర్ సినిమాపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో లో చూపించిన కథ మరీ పాత చింతకాయ పచ్చడి కావటంతో దెబ్బపడిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 28 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. దీనికంటే ముందు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య లు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ హిట్స్ సాధించాయి. భోళా శంకర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్స్ లో కూడా అంటే శని, ఆదివారాలు షో లకు కూడా ఈజీ గా టికెట్స్ దొరుకుతున్నాయి.

ఫస్ట్ షో నుంచే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ ప్రారంభం అయింది. ఈ ప్రభావం కలెక్షన్స్ పై కూడా స్పష్టంగా కనబడబోతుంది. రెండవ రోజు నుంచే కలెక్షన్స్ దారుణంగా పడిపోయే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి గత సినిమా వాల్తేర్ వీరయ్య తో పోలిస్తే భోళా శంకర్ బాగా వెనకబడినట్లే లెక్క. మరో వైపు భోళా శంకర్ కంటే ఒక రోజు ముందు అంటే ఆగస్టు 10 న విడుదల అయిన రజనీకాంత్ సినిమా జైలర్ మాత్రం మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

Next Story
Share it