Telugu Gateway
Cinema

'డేనియల్ శేఖర్' వ‌చ్చేశాడు

డేనియల్ శేఖర్ వ‌చ్చేశాడు
X

బీమ్లా నాయ‌క్ సినిమాలో ద‌గ్గుబాటి రానా పాత్ర ప‌రిచ‌య వీడియో విడుద‌ల అయింది. సోమ‌వారం సాయంత్రం చిత్ర యూనిట్ దీన్ని విడుద‌ల చేసింది. ఇందులో రానా డైలాగులు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రానా 'డేనియల్ శేఖర్' గా క‌న్పించ‌నున్నాడు. "నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది...నేనెవరో తెలుసా ధర్మేంద్ర ... హీరో ..హీరో..! అంటూ రానా చెప్పే డైలాగుల‌తో ఈ వీడియో ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమా మ‌ళ‌యాళం సూప‌ర్ హిట్ మూవీ అయ్య‌ప్పనుమ్ కోషియం కు రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Next Story
Share it