Telugu Gateway
Cinema

'బీమ్లా నాయ‌క్' టైటిల్ సాంగ్ విడుద‌ల‌

బీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ విడుద‌ల‌
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న కొత్త సినిమా 'బీమ్లా నాయ‌క్' ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేశారు. టైటిల్ సాంగ్ పేరుతో విడుద‌ల చేసిన ఈ పాట ప్రారంభంలో కాస్త స్లోగా ఉన్న‌ట్లు క‌న్పించినా త‌ర్వాత త‌ర్వాత ఊపందుకుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సెట్ అయ్యేలా పూర్తి మాస్ మ‌సాలా దినుసుల‌తో పాట సిద్ధం చేశారు. సుంద‌ర‌మైన అట‌వీ ప్రాంతాల స‌న్నివేశాల‌తోపాటు ఈ పాట ఆక‌ట్టుకునేలా ఉంది.సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోపాటు ద‌గ్గుబాటి రానా కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ళ‌యాళం సూప‌ర్ హిట్ మూవీ అయ్య‌ప్ప‌నుమ్ కోషియంకు రీమేక్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమాలో నిత్యామీన‌న్, ఐశ్వ‌ర్వారాజేష్ లు సంద‌డి చేయ‌నున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించారు.

Next Story
Share it