బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ముహుర్తం ఫిక్స్
BY Admin30 Aug 2021 3:39 PM GMT
X
Admin30 Aug 2021 3:39 PM GMT
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు చేస్తున్న సినిమా బీమ్లా నాయక్. ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ ను ఇచ్చింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 2న టైటిల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించి లుక్ ను విడుదల చేశారు.
మళయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్ గా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్యా రాజేష్ లు సందడి చేయనున్నారు.
Next Story