Telugu Gateway
Cinema

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
X

ఏపీ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో సోమ‌వారం నాడు హైద‌రాబాద్ లో జ‌ర‌గాల్సిన బీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేశారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల్సి ఉంది. అయితే ఈ విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుందన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తోపాటు ఈ రోజు సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేయాల్సి ఉంది.

Next Story
Share it