Telugu Gateway
Cinema

'బీమ్లానాయ‌క్' న్యూలుక్

బీమ్లానాయ‌క్ న్యూలుక్
X

సంక్రాంతి బ‌రిలో నిల‌వాల్సిన 'బీమ్లానాయ‌క్' సినిమా ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు ఆర్ఆర్ఆర్ రాలేదు..బీమ్లానాయ‌క్ కూడా రాలేదు. అయితే సంక్రాంతి పండ‌గను పుర‌స్క‌రించుకుని బీమ్లానాయ‌క్ చిత్ర యూనిట్ న్యూలుక్ ను విడుద‌ల చేసింది. ఈ లుక్ అద‌ర‌గొడుతోంది. చేతిలో గ‌న్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నోట్లో సిగ‌రెట్ తో రానా ద‌గ్గుబాటి స్టైల్ గా ఉన్న ఈ లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించింది.

Next Story
Share it