Telugu Gateway
Cinema

'బీమ్లానాయ‌క్' ద‌స‌రా స్పెష‌ల్

బీమ్లానాయ‌క్  ద‌స‌రా స్పెష‌ల్
X

'బీమ్లానాయ‌క్' సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ మంగ‌ళవారం నాడు కొత్త అప్ డేట్ వ‌చ్చింది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి 'అంత ఇష్టం' లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నిత్యామీన‌న్ జోడీగా ఉండే ఈ పాట‌ను విడుదల చేయ‌నున్నారు. మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియం సినిమాకు ఇది రీమేక్ అన్న విష‌యంలో తెలిసిందే.

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోపాటు ద‌గ్గుబాటి రానా కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే.ఈ సినిమా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానున్న విషయం తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌ర్య‌వేక్షణ‌లో సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it