Telugu Gateway
Cinema

'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్'

భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. లుక్కే కాదు..టైటిల్ కూడా ప్ర‌క‌టించేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. చిత్ర యూనిట్ గురువారం ఉద‌యం ముందు ప్ర‌క‌టించిన ముహుర్తానికే టైటిల్ ను..లుక్ ను విడుద‌ల చేసింది. ఢిల్లీ గేటు ముందు బైక్ పై స్టైల్ గా కూర్చుని టీ తాగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రాన్ని విడుద‌ల చేశారు. ప‌వ‌ర్ ఫుల్ టైటిల్...ప‌వ‌ర్ ఫుల్ క‌టౌట్ అంటూ రాసుకొచ్చారు దీని కింద‌. ఈ సారి కేవ‌లం ఎంట‌ర్ టైన్ మెంట్ మాత్ర‌మే కాద‌ని పేర్కొన్నారు.

ఈ సినిమా వెండితెర‌పై చెర‌గ‌ని సంత‌కం అవుతుంద‌ని అన్నారు. హ‌రీష్ శంక‌ర్, ప‌వ‌న్ కళ్యాణ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ ఎంత సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఈ టైటిల్ లోనూ గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర‌హాలోనే భ‌గ‌త్ సింగ్ లెట‌ర్లు ఉండ‌టం విశేషం. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జోడీ క‌ట్టే భామ ఎవ‌రో తేలాల్సి ఉంది.

Next Story
Share it