Telugu Gateway
Cinema

దర్శకుడు శంకర్ సాహసం

దర్శకుడు శంకర్ సాహసం
X

తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో మూడు గంటల సినిమా రానుంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి సినిమా మూడు గంటల ఒక నిమిషం నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపే వసూళ్లతో రికార్డు లు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సంచలన దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా కూడా మూడు గంటల నిడివితో రానుంది. జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. 1996 లో వచ్చిన సంచలన సినిమా భారతీయుడుకి ఇది సీక్వెల్.

ఇంత ఎక్కువ నిడివి గల సినిమాను ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా తెరకెక్కించాలంటే అది కత్తి మీద సాము అనే విషయం తెలిసిందే. అయితే దర్శకుడు శంకర్ కావటం...ఈ సినిమాపై హైప్ కూడా ఒక రేంజ్ లో ఉండటంతో ఇది పెద్ద సమస్య కాదు అని చిత్ర యూనిట్ ధీమాతో ఉంది. భారతీయుడు 2 లో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదల అయిన భారతీయుడు 2 ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది.

Next Story
Share it