Telugu Gateway
Cinema

భ‌లే భ‌లే బంజారా పాట వ‌చ్చేసింది

భ‌లే భ‌లే బంజారా పాట వ‌చ్చేసింది
X

ఆచార్య సినిమా నుంచి భ‌లే భ‌లే బంజారా లిరిక‌ర్ సాంగ్ ను చిత్ర యూనిట్ ముందు చెప్పినట్లుగానే సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ల స్టెప్పులు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఒక పూర్తి స్థాయి పాట‌కూ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు క‌ల‌సి డ్యాన్స్ చేయ‌టం ఇదే మొద‌టిసారి కావ‌టంతో వీరిద్ద‌రి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. డ్యాన్స్ ల్లో ఇద్ద‌రికీ మంచి ప‌ట్టు ఉన్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it