Telugu Gateway
Cinema

బాలకృష్ణ పండగ సెంటిమెంట్

బాలకృష్ణ పండగ సెంటిమెంట్
X

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తొలి సినిమా భగవంత్ కేసరి. చిత్ర యూనిట్ శనివారం నాడు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్ 19 న విడుదల కానుంది. అంటే ఈ సినిమా దసరా పండగను టార్గెట్ చేసుకుని విడుదల అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే దసరా పండగ అక్టోబర్ 24 అయితే...ఈ సినిమా ను అక్టోబర్ 19 న ప్రేక్షుకుల ముందుకు తెస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే...మరో కీలక పాత్రలో శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి కే బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి విడుదల అయి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దసరాకు విడుదల అయ్యే భగవంత్ కేసరి కూడా హిట్ అయితే బాలకృష్ణ కు హ్యాట్రిక్ విజయం దక్కినట్లు అవుతుంది. అఖండ, వీరసింహ రెడ్డి లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు భగవంత్ కేసరి ఫలితం తేలాల్సి ఉంది.

Next Story
Share it