Telugu Gateway
Cinema

భగవంత్ కేసరి రికార్డు

భగవంత్ కేసరి రికార్డు
X

భగవంత్ కేసరి సినిమాతో నందమూరి బాలకృష్ణ దుమ్మురేపుతున్నారు. బుక్ మై షో లో ఇప్పటివరకు పది లక్షల టికెట్స్ అమ్ముడు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. దసరా బరిలో నిలిచినా ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళుతోంది. ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తే...మరో కీలక పాత్రలో శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి బాలకృష్ణతో కలిసి రూట్ మార్చి చేసిన ప్రయోగం ఇద్దరికీ మంచి ఫలితాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. సుదీర్ఘ కాలం తర్వాత బాలకృష్ణ ఫ్యామిలీ మూవీలో నటించినట్లు చెప్పొచ్చు. వచ్చేవారం కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవటంతో భగవంత్ కేసరి సినిమా కలెక్షన్స్ రాబోయే రోజుల్లో కూడా ఆశాజనకంగా ఉంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Next Story
Share it