భాగ్ సాలే షో రద్దు

ఈ శుక్రవారం నాడు ఒకే సారి ఏడు సినిమా లు విడుదల అయ్యాయి. ఇందులో ఎక్కువ చిన్న సినిమాలే అని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ లో సినిమాలకు క్రేజ్ ఉండే ప్రాంతాల్లో కేపీహెబ్ బి, జె ఎన్ టియు ఏరియా లు ఉంటాయి. కానీ ఇక్కడ శుక్రవారం నాడు విచిత్ర పరిస్థితి ఎదురైంది కొంత మందికి. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే శ్రీ సింహ, నేహా సోలంకి జంటగా నటించిన సినిమా భాగ్ సాలే. ఇది కూడా శుక్రవారం నాడే విడుదల అయింది.
జె ఎన్ టియు దగ్గర ఉన్న మల్లికార్జున థియేటర్ లో ఉందయం 11 . 15 గంటలకు షో వేశారు. ఆన్ లైన్ లో...ఆఫ్ లైన్ లో కలుపుకుని మొత్తం 20 టికెట్ ల లోపే అమ్ముడు అవటంతో ఇక్కడ షో రద్దు చేశారు. ఇక్కడకు వచ్చిన వాళ్లలోని 20 మందిలో పది మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. కాలేజీ డుమ్మా కొట్టి మరీ సినిమా కు వస్తే అటు కాలేజీ పోయింది...ఇటు సినిమా కూడా లేకుండా పోయింది. దీంతో కొంత మంది పక్కనే ఆడుతున్న రంగబలి కి వెళ్లిపోయారు. భాగ్ సాలే సినిమా కు చాలా చోట్ల ఓపెనింగ్స్ ఫుల్ వీక్ గా ఉన్నాయనే చెప్పాలి. మల్లికార్జునలో అయితే ఏకంగా షో రద్దు చేశారు.