Telugu Gateway
Cinema

ప్రభాస్ సినిమా మోషన్ పోస్టర్ 23న

ప్రభాస్ సినిమా మోషన్ పోస్టర్ 23న
X

హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే ఆయన ఫ్యాన్స్ కు పండగే. ఎందుకంటే పుట్టిన రోజున ప్రతి హీరో సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావటం సహజం. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు సంబంధించి కూడా అలాంటిదే రాబోతోంది. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న. అదే రోజున ప్రభాస్, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్' కు సంబందించిన మోషన్ పోస్టర్ ను విడుడల చేయనున్నారు.

ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమాను రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే పుట్టిన రోజు(అక్టోబర్‌ 13)న రాధేశ్యామ్ నుంచి ఆమె లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభాష్ కొత్తగా ఆదిపురుష్ సినిమాతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.

Next Story
Share it