Telugu Gateway
Cinema

ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది

ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది
X

బీట్స్ ఆఫ్ రాథే శ్యామ్. ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. దట్టమైన మేఘాల్లో నుంచి ఓ చేయి రావటం..ఆ చేయిపై నుంచి పచ్చటి అడవిలోకి ప్రయాణం...అడవిలో రైలు జర్నీ. అందులో ప్రభాస్..పూజా హెగ్డె. బీట్స్ ఆఫ్ రాథే శ్యామ్ విశేషంగా ఆకట్టుకోనుంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కన్పించబోతున్నారు. శుక్రవారం నాడు ప్రభాస్ పుట్టిన రోజు కావటంతో చిత్ర యూనిట్ ఈవీడియోను విడుదల చేసింది. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ లో రైలు జర్నీ..అందులో ప్రభాస్, పూజా హెగ్డెలు ఆకట్టుకునేలా ఉన్నారు.

వింటేజ్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. కరోనా భయాన్ని వదిలేసి షూటింగ్ లు ప్రారంభించటంతో అభిమానులకు సందడి మొదలైంది. గురువారం నాడు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన వీడియో రాగా...శుక్రవారం నాడు ప్రభాస్ కు చెందిన రాథే శ్యామ్ బీట్స్ వచ్చేశాయి.

Next Story
Share it