బాలకృష్ణ కూడా వచ్చేస్తున్నాడు..మే 28న
BY Admin31 Jan 2021 10:32 AM GMT
X
Admin31 Jan 2021 10:32 AM GMT
బాలకృష్ణ..బోయపాటి. ఈ కాంబినేషన్ అంటేనే ఆయన ఫ్యాన్స్ లో ఏదో తెలియని జోష్. ఇప్పుడు ఆ బీబీ3 సినిమా విడుదల తేదీ వచ్చేసింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా మే28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు రవీందర్ రెడ్డి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ లేక బాలకృష్ణ అబిమానుల్లో ఒకింత నిరాశ నెలకొంది. ఈ తరుణంలో సినిమా విడుదల తేదీ రావటంతో ఫ్యాన్స్ కుషీకుషీగా ఉన్నారు.
Next Story