Telugu Gateway
Cinema

సరదా సరదాగా 'బంగారు బుల్లోడు' ట్రైలర్

సరదా సరదాగా బంగారు బుల్లోడు ట్రైలర్
X

అల్లరి నరేష్, పూజా జవేరి హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమానే 'బంగారు బుల్లోడు'. మంగళవారం నాడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది సరదా సరదా డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ప్రారంభంలోనే థర్టీ ఇయర్స్ పృథ్వీ డైలాగ్ 'కొత్త లోన్లు తీసుకునే వారే కానీ..పాత లోన్లు కట్టే వారు ఒక్కరు కూడా కన్పించటం లేదు.' అంటూ చెప్పే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. మధ్యలో 'మీ నగలు బాగున్నాయండి..ఎక్కడ కొన్నారు. లలితా జ్యువెలర్స్ అని..గుండు ఆయన కొట్లో కొన్నారండి మా అయన.అంటూ మరో డైలాగ్.

గుడిలో ప్రదక్షణలు చేస్తున్న అమ్మాయి కాళ్ళు కాలుతున్నాయని నరేష్‌ అక్కడ ఉన్న బిందెను తన్నడం, తీరా అది వేడి నీళ్ల గిన్నె అని తెలియడంతో నాలుక్కరుచుకోవడం వంటి సీన్లు బాగున్నాయి. ట్రైలర్ మాత్రం ఈ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పాలి. గిరి పి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమాలోని స్వాతిలో ముత్యమంత పాటను రీమిక్స్‌ చేశారు. బంగారు బుల్లోడు జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.

Next Story
Share it