నువ్వు ఈ ఊరికే కాదు....ఈ రాష్ట్రానికి సర్పంచ్...దేశానికే సర్పంచ్ కావాలి అంటూ అక్కినేని నాగచైతన్య వీరలైవల్ లో హీరోయిన్ కృతిశెట్టిని మోస్తాడు. కృతిశెట్టి పక్కనున్న ఫ్రెండ్స్ మాత్రం దేశానికి సర్పంచ్ ఏంటే..ఏదో ప్లాన్ లో ఉన్నాడు అంటూ ఝలక్ ఇస్తారు. ఇలాంటి సరదా సరదా సన్నివేశాలతో బంగార్రాజు సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్యలకు జోడీలుగా రమ్యక్రిష్ణ, కృతిశెట్టిలు సందడి చేస్తున్నారు. ఫరియా అబ్దుల్లా కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. సంక్రాంతికి ఈ సినిమా కూడా రేసులో ఉంది. కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.