అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యక్రిష్ణ, కృతి శెట్టిలు నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది మంగళవారం నాడు. వచ్చాడు వచ్చాడు నవ మన్మథుడు వచ్చాడు అంటూ అక్కినేని నాగచైతన్య ను స్టైలిష్ గా చూపించారు ఇందులో. ఓ ఇంట్లో నుంచి బయటకు వస్తూ చేతిలోని కర్రను కింద కొడితే అది వెళ్లి బుల్లెట్ హ్యాండిల్ లో పడిపోవటం టీజర్ లో హైలెట్ గా నిలిచింది.